మంగళవారం, జన్నారం మండలంలోని పొన్కల్, దేవునిగూడ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.