తుమ్మగూడలో లక్కేరావు వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

దివంగత ఆదిమ గిరిజన సలహా మండలి చైర్మన్ కనక లక్కేరావు ద్వితీయ వర్ధంతిని శుక్రవారం ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరై లక్కేరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ప్రజలకు లక్కేరావు చేసిన సేవలను స్మరించుకొన్నారు. లక్కేరావు మనుమరాలు, మనువళ్ల చదువుల కోసం రూ. 50 వేల నగదు ఆర్ధిక సహాయాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్