విద్యార్థులతో జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్లో  ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, విద్యార్థుల మధ్య నా జన్మదినాన్ని జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ నా వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, DCP భాస్కర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ దర్ని మధుకర్, నాయకులు, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕