ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ శుక్రవారం ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో సిరికొండ మరియు ఇంద్రవెల్లి మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ఉదయం 9:30 కు మండల కేంద్రంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో పివిటిజి రైతులకు ఐటిడిఏ ద్వారా వివిధ రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తారు. ఉదయం 11:30 కు మండలంలోని తుమ్మగూడ గ్రామంలో మాజీ ఐటిడిఏ చైర్మన్ కనక లక్కేరావు 2వ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతారు.