మంచిర్యాల పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణ పనులను ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులతో కలిసి పరిశీలించారు. 20 కోట్ల రూపాయలతో బస్టాండ్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ, మున్సిపల్ కమిషనర్, మేయర్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.