పాత కక్షలు.. వ్యక్తి దారుణ హత్య!

మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన గజ్జి వెంకటేష్ మేనకోడలిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసేందుకు యత్నించిన ఒద్దెపల్లి రాజ్కుమార్, పెద్దల జోక్యంతో వివాహం జరిపించడంతో కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి పాడైన సెల్ఫోన్ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో, రాజ్కుమార్ సిమెంట్ రాయితో దాడి చేయగా వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్