తెలుగు కళా రత్నాలు సాంసృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బాల కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ కవిత పోటీలో 'బాలికే జగతిలో బంగారు భవిత' అనే శీర్షికతో కవిత రాసినందుకు చైతన్య శ్రీ అనే బాలికకు డా యూ. వి. రత్నం, డా ధనాషి ఉషారాణి చేతుల మీదుగా బాలికా చైతన్య శ్రీ బిరుదును శుక్రవారం ప్రదానం చేశారు. గత సంవత్సర కాలంలో అనేక సాహితీ సంస్థల నుండి ప్రశంసలు అందుకున్న ఈమె, చమక్కుల కవి శ్రేష్ఠ, శ్రామిక మిత్ర, మాతృ సేవా బంధు, సృజనాత్మక సేవా సౌరభం వంటి ఐదు బిరుదులు, సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు. ఈ పోటీ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ లో జరిగింది.