జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సాధ్వి నిరంజన్ కి బహిరంగ లేఖ

మంచిర్యాలలో బుధవారం కేంద్రం నిర్వహిస్తున్న జన గణనలో ఓబీసీ కులం చేర్చి కులానికి ఒక యూనిక్ కోడ్ పెట్టేలా కేంద్రానికి సిఫార్సులు చేయాలనీ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సాధ్వి నిరంజన్ జ్యోతికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బహిరంగ లేఖను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడిచిన ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సమగ్రంగా బీసీ కులగణన చేపట్టకపోవడం విచారకరమన్నారు. ప్రధాని మోడీ బీసీ కులగణన చేపడుతామని పార్లమెంట్ సాక్షిగా చెప్పినప్పటికి జనగణనలో ఓబీసీ కాలం ఏర్పాటు చేయకపోవడం బీసీ సమాజానికి అన్యాయం చేయడమేనని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్

✕
✕