ప్రతిపక్షం క్యాలెండర్ ఆవిష్కరణ: బడుగుల పక్షాన నిలవాలని వంగల దయానంద్ ఆకాంక్ష

మంచిర్యాల పట్టణంలో బుధవారం ప్రతిపక్షం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వంగల దయానంద్, పత్రికలు సమాజంలోని రుగ్మతలను తొలగించి, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలవాలని, నిజాలను నిగ్గు తేల్చే వార్తలు ప్రచురించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నిన్నల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్