బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే వర్ధంతి

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమం శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇంచార్జి దాగం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం ఫూలే చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని దాగం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు ఆర్టికల్ నైన్త్ షెడ్యూల్ ద్వారా చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్