మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని గ్రామ కార్యదర్శి విశ్వ, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 4 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 3000 మొక్కలు నాటినట్టు వారు వెల్లడించారు. ఇందులో ఈజీఎస్ కూలీలు, తదితరులు వున్నారు.