కార్మికుల హక్కుల కోసం సమ్మెకు సిద్ధం: AITUC

పెద్దపల్లి జిల్లా రామగిరిలోని RG2 8inc కాలనీ కమ్యూనిటీ హాల్లో నిన్న సాయంత్రం RG2, RG3 ఏరియా కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో AITUC రాష్ట్ర అధ్యక్షులు MD యుసాఫ్, AITUC SEWU అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ YV రావు, వైస్ ప్రెసిడెంట్ బండారి క్రాంతి, బ్రాంచ్ సెక్రటరీ MRC రెడ్డి, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ DT రావు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు జరిగే నష్టాలను వారు వివరించారు. సింగరేణిలో పరిణామాలను బట్టి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు సిద్ధమని తెలిపారు. మేడే రోజు ప్రతి కార్మికుడు మైన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కార్మికుల ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో OCP1, OCP2, ALP, CHP, S&PC గనులు, డిపార్ట్మెంట్లలోని పిట్ సెక్రటరీలు, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు, షిఫ్ట్ సెక్రటరీలు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ, టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ, యూనియన్ డెలిగేట్స్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్