వరి పంట నేలకొరిగింది, పరిహారం కోసం రైతుల ఆందోళన

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలంలోని వీరవేల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిన్న కురిసిన భారీ వర్షానికి సుమారు 200-300 ఎకరాల వరి పంట నేలకొరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని, అధికారులు పరిశీలించి వెళ్లినా ప్రయోజనం లేదని వీరవేల్లి గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. ఈసారి అయినా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని వారు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్