మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎం, ఏసీటీ మధ్య వివాదం పోలీసుల వరకు చేరింది. విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడి తీసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. మూడు రోజుల క్రితం హెచ్ఎం, ఆదివారం ఉపాధ్యాయుడు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ రెండు వర్గాల నుంచి ఫిర్యాదు అందినట్లు ధృవీకరించారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.