కేవీకే క్లస్టర్ ఇన్‌ఛార్జ్ స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని 56 గ్రామాల్లో ఈనెల 27న 'రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం జరగనుంది. ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ సదస్సులకు హైదరాబాద్ నుంచి నిపుణులు హాజరవుతారు. నూతన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.