కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) పిలుపు మేరకు చేపట్టిన నిరసన దీక్షకు శ్రీరాంపూర్ ఏరియా INTUC యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్రావు పూర్తి సంఘీభావం ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో దీక్షా శిబిరాన్ని సందర్శించి, అధికారుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపారు. సింగరేణి సంస్థ అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నా, వారి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని శంకర్రావు ఆరోపించారు.