మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, దండేపల్లి ఎస్ఐ తైసోద్దీన్ కాంగ్రెస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మాధవిని నామినేషన్ ఉపసంహరించుకునేలా బెదిరించారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. ఎన్నికల అధికారులతో కలిసి మాధవిని ఆర్వో ఆఫీసుకు తీసుకెళ్లారని, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు దివాకర్ రావు పేర్కొన్నారు.