శ్రీరాంపూర్: ఓసీపీలో విద్యుత్ కేబుల్ చోరీ

శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు 40 మీటర్ల కాపర్ విద్యుత్ కేబుల్ చోరీకి గురైంది. విద్యుత్ సరఫరా ఉండగానే పదునైన ఆయుధాలతో కేబుల్‌ను కట్ చేసి దొంగలు తీసుకెళ్లారు. కరెంటు పోవడంతో అనుమానం వచ్చిన అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది గనిని పరిశీలించగా, దొంగలు అప్పటికే పరారయ్యారు. ఓబి బెంచ్‌ల పై నుంచి వచ్చి దొంగతనం చేసి, అటు నుంచి తిరిగి పరారైనట్లు ఆనవాళ్లున్నాయని ఓసిపి అధికారులు తెలిపారు. ఈ చోరీ విలువ సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేయబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్