మంచిర్యాల జిల్లా, చెన్నూర్ ప్రాంతంలో పంట పొలాల చుట్టూ అడవి జంతువుల నివారణ కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని మందమర్రి ఎస్ఐ నరేష్ గురువారం హెచ్చరించారు. ఈ తీగల వల్ల ప్రాణనష్టం సంభవిస్తే, సంబంధిత భూ యజమాని లేదా కనెక్షన్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై నేరపూరిత మానవహత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తారని, అక్రమ కనెక్షన్లు గుర్తిస్తే జరిమానాలు, జైలు శిక్ష తప్పవని పేర్కొన్నారు. రైతులు సోలార్ ఫెన్సింగ్, నైలాన్ నెట్లు వంటి సురక్షిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు.