మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒకే రోజు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటం విషాదానికి గురిచేసింది. స్థానిక అశోక్ రోడ్ కు చెందిన లెక్కల మహేందర్, జాఫర్ నగర్ కు చెందిన శుభం మండల్ లు మద్యానికి బానిసై గురువారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందారు. అలాగే హామలివాడకు చెందిన తొగరి శ్రీధర్ స్నేహితులకు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.