ఐటీసీ, ఏటీసీ కేంద్రాలలో ప్రవేశానికి నేడు ఆఖరు

జన్నారం మండలంలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ఉన్న కోర్సులలో ప్రవేశానికి మంగళవారం చివరి తేదీ అని కళాశాల ప్రిన్సిపల్ వై. రమేశ్ తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో కోప, డ్రెస్ మేకింగ్, వెల్డర్ కోర్సులతో పాటు, ఏటీసీలో రోబోటిక్, తదితర ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆయా వెబ్సైట్లో సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.

సంబంధిత పోస్ట్