బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీసీ వర్గాల ప్రజలు పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం ఉట్నూర్ మండలం నాగపూర్ గ్రామంలో బీసీ వర్గాల ప్రజలతో కలిసి భారతపు శ్రీ రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.