రామగుండం పోలీస్ కమీషనరేట్ లో బుధవారం 75వ వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనరేట్ ఆవరణలో సీపీ ఎం. శ్రీనివాస్ పోలీస్ అధికారులు, విద్యార్థిని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమత్యులతను కాపాడటంలో చెట్లు ఎంతో దోహదపడుతాయని తెలిపారు. మొక్కలు నాటి సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.