కృష్ణపల్లిలో కొలవారి సంక్షేమ సంఘం, తుడుందెబ్బ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు

నెన్నెల మండలం కృష్ణపల్లిలో కొలవారి సంక్షేమ సంఘం, తుడుందెబ్బ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా శంకర్, ఉపాధ్యక్షుడిగా బాపు, కార్యదర్శిగా కొండపల్లి శంకర్, సహాయ కార్యదర్శిగా సునీత, ప్రచార కార్యదర్శిగా అంకిత, కోశాధికారిగా వెంకటమ్మను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ మహిళా మండల అధ్యక్షురాలు లక్ష్మి, మండల, జిల్లా నాయకులు శ్రీనివాస్, భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕