ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ జంగల్ హనుమాన్ ఆలయాన్ని ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గురువారం దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.