ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

దండేపల్లి మండలం వెల్గనూరుకు చెందిన మెండె పద్మ(45) ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజవర్ధన్ శనివారం తెలిపారు. ఇటీవల భర్త, పెద్ద కుమారుడు మృతి చెందడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఈ నెల 26న రాత్రి భోజనం చేసి నిద్రించిన పద్మ, శనివారం ఉదయం తన చిన్న కుమారుడు రాకేశ్ పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించింది. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్