రైలులో ప్రయాణిస్తూ మహిళ మృతి

శుక్రవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో జీటి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన జిలానీ (38) అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రైల్వే అధికారులు స్పందించి, 108 అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్