నిర్మల్: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

లక్ష్మణచందా మండలంలో బుధవారం నర్సాపూర్(డబ్ల్యు) గ్రామానికి చెందిన కాయితి రవీందర్ రెడ్డి (48) అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. అటవీ పందుల నుంచి పంటను రక్షించుకోవడానికి పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను ప్రమాదవశాత్తూ తాకడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలోనే రైతు మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్