నర్సాపూర్ (జి) మండలంలోని చాక్పెల్లి గ్రామం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. టీ తాగడానికి రోడ్డు దాటుతున్న చాక్పెల్లి గ్రామానికి చెందిన కొండ మంగలి చిన్నయ్య (40)ను నిర్మల్ నుండి బైంసా వైపు వస్తున్న సతీష్ నడుపుతున్న మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నయ్యకు గాయాలయ్యాయి. అతన్ని 108 అంబులెన్స్ ద్వారా బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుని కుమారుడు ముఖేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.