మామడ మండలం రాంపూర్, పోచమ్మగూడెం గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తాపూర్ వరకు కాలినడకన వెళ్లి, అక్కడి నుంచి వాహనాల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. పులిమడుగు మార్గంలో వాగుపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రమవుతోంది. దాదాపు 25 ఏళ్లుగా ఈ కష్టాలు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.