వేమనపల్లి: 15 లీటర్ల గుడుంబా పట్టివేత

వేమనపల్లి మండలం మంగనపల్లి ఎక్స్ రోడ్ వద్ద నిల్వాయి ఎస్సై జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో 15 లీటర్ల గుడుంబాను పోలీసులు పట్టుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కు చెందిన ఆనంద్ అనే వ్యక్తి గుడుంబాను అమ్ముకునేందుకు వేమనపల్లి వైపు వెళ్తుండగా, పోలీసులకు అందిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. బ్యాగుతో వెళుతున్న ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా, అందులో గుడుంబా ప్యాకెట్లు లభించాయి.

సంబంధిత పోస్ట్