మంచు కుటుంబంలో వివాదాల నేపథ్యంలో మనోజ్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మద్యం తాగి ఓ వ్యక్తితో గొడవ పడుతుండగా, మోహన్ బాబు సముదాయిస్తున్నట్లు అందులో ఉంది. అయితే ఇది ఎక్కడ? ఎప్పుడు జరిగిందనేది స్పష్టత లేదు. ఫ్యామిలీ గొడవల సందర్భంగా ఎవరో ఈ వీడియోను ఇప్పుడు విడుదల చేశారని అంటున్నారు. కాగా, మనోజ్ మద్యానికి బానిస అయ్యాడన్న మోహన్ బాబు వ్యాఖ్యలు నిజమేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.