బాల్కనీలోనూ మామిడి చెట్లు పెంచడం సాధ్యమే!

ఆధునిక గార్డెనింగ్ పద్ధతులతో ఇంటి బాల్కనీ, చిన్న టెర్రస్‌లో కూడా మామిడి పండ్లను పండించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. తక్కువ స్థలంలో మామిడి చెట్టును పెంచడానికి డ్వార్ఫ్ వెరైటీ (కురచ రకాలు) మొక్కలను ఎంచుకోవాలంటున్నారు. ఆమ్రపాలి, తైవాన్ ఆల్ టైమ్ మ్యాంగో వంటి రకాలు కుండీల్లో పెరగడానికి అనువుగా ఉంటాయి. 20-24 అంగుళాల కుండీ, సారవంతమైన మట్టి మిశ్రమం (40% ఎర్రమట్టి, 30% కంపోస్ట్, 20% కోకోపీట్, 10% ఇసుక), రోజుకు 6-8 గంటల ఎండ, క్రమబద్ధమైన కత్తిరింపులు, అతిగా నీరు పోయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్