ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ పార్థివదేహం (వీడియో)

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ఉదయం 10 గంటల వరకు అక్కడే ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక ఇతర నేతలు కార్యాలయానికి చేరుకొని భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కాగా ఉదయం 10 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి

సంబంధిత పోస్ట్