షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కంచుమోత

నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ మహిళల విభాగంలో కాంస్యం సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో 17.17 మీటర్ల దూరం ఇనుప గుండును విసిరిన మన్‌ప్రీత్, ఆసియాడ్ మహిళల షాట్‌పుట్‌లో పతకం సాధించిన మూడో భారత మహిళగా చరిత్రకెక్కింది. ఆమె కంటే ముందు బర్బరా వెబ్‌స్టర్ (1951) మరియు కిరణ్‌ బలియన్ (2023) కాంస్యంతో మెరిశారు. ఇదే విభాగంలో కృష్ణ జయశంకర్ మీనన్ 16.5 మీటర్ల దూరంతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆరో రోజు భారత్‌ ఖాతాలో ఇది మూడో పతకం.

సంబంధిత పోస్ట్

✕
✕