మొబైల్‌ ఫోన్ల తయారీ.. కేంద్రం కొత్త స్కీమ్‌

భారతదేశాన్ని ప్రపంచ మొబైల్ ఫోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.62,500 కోట్ల వ్యయంతో ‘మొబైల్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్’ (MPMS)కు ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశీయ తయారీ, ఎగుమతులు, ఉపాధి, పరిశోధన-అభివృద్ధి (R&D), స్వదేశీ బ్రాండ్ల అభివృద్ధికి ఊతం లభిస్తుంది. అర్హత కలిగిన కంపెనీలకు విక్రయాలపై 2.25% నుంచి 5% వరకు ప్రోత్సాహకాలు, దేశీయ విడిభాగాల కొనుగోలుకు 1.5%, భారతీయ బ్రాండ్ల R&D పెట్టుబడులకు అదనంగా 3% ప్రోత్సాహకం అందనుంది.

సంబంధిత పోస్ట్