దేశవ్యాప్తంగా బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ భద్రతను పెంచేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు కొత్త డొమైన్‌లను ప్రవేశపెట్టాయి. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు అక్టోబర్ 31లోపు అన్ని బ్యాంకులు తమ వెబ్‌సైట్లను ‘.bank.in’ డొమైన్‌కి మార్చాయి. SBI, PNB, కెనరా బ్యాంక్‌తో పాటు HDFC, ICICI, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా కొత్త డొమైన్‌లను ప్రారంభించాయి. భవిష్యత్తులో ‘.fin.in’ డొమైన్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని RBI తెలిపింది.