కమలాపండు (సంత్రాలు) అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణుల్ చెబుతున్నారు. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉండి, కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ రక్షణకు తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫోలేట్ అధికంగా ఉండటం వల్ల మహిళలకు, గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు నియంత్రణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.