వాకింగ్ క్రమం తప్పకుండా రోజూ నడవడం వల్ల కండరాలు దృఢంగా మారి శరీరాకృతి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం వంగిపోకుండా నిటారుగా నిలబడతారని అంటున్నారు. రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని, చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని పేర్కొన్నారు. వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి చర్మానికి ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.