తెలంగాణలోని ఆసిఫాబాదు నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు తదితరులు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో వారికి మహేష్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.