ప్రకృతి ప్రసాదించిన చిలగడదుంపలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ తోడ్పడుతుంది.