వర్షాకాలంలో ఇంట్లో వామాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను వామాకులు తక్షణమే తగ్గిస్తాయి. థైమాల్ అనే రసాయనం వల్ల దీనికి ఔషధ గుణాలు చేకూరుతాయి. వామాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి తగ్గుతాయి. కడుపులో సూక్ష్మక్రిములను, నులిపురుగులను చంపే గుణం కూడా దీనికి ఉంది. మూత్రపిండాల రాళ్లు, గుండె జబ్బులకు ఇది సంజీవనిగా పనిచేస్తుంది. అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.