మావోయిస్టు నేత, ఎంఎంసీ(మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ ఎలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తనతో సహా 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా మహారాష్ట్రలోని గోండియాలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. అనంత్‌పై రూ.కోటి రివార్డు ఉంది.