ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు, AOB, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు, భద్రాద్రి జిల్లాలో 12 మంది నక్సలైట్లు నిన్న ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లొంగిన వారికి పోలీస్ శాఖ తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందజేసింది.