భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. లింపియాధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను తమ భూభాగంగా చూపించే మ్యాప్‌ను కొత్తగా విడుదల చేయనున్న రూపాయి నాణెంపై ముద్రించేందుకు నేపాల్ జాతీయ బ్యాంకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో అంతర్భాగమని భారత్ స్పష్టం చేస్తోంది. వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తోంది. 2020లో నేపాల్ ప్రభుత్వం ఈ ప్రాంతాలను కలుపుతూ ఓ మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.