AP : మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది మృతికి ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పోలీసులు గుర్తించారు. బస్సు కండిషన్ బాగోలేదని తెలిసినా, లైసెన్స్ లేని డ్రైవర్‌తో బస్సు నడిపించారు. మార్గమధ్యంలో బస్సు మూడుసార్లు ఆగిందని, యజమానికి ఫోన్ చేసినా స్పందన లేదని తెలిసింది. బస్సు స్టార్ట్ అయ్యాక క్లీనర్ నడిపాడని, మార్కాపురం వద్దకు వచ్చాక ప్రమాదం జరిగిందని డ్రైవర్ వివరించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా క్లీనరే బస్సు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. లైసెన్స్ లేని డ్రైవర్ నడపడంతో ఇన్సూరెన్స్ డబ్బులు రావని తెలిసి, అధికారులు జోక్యం చేసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.