దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, రూపాయి బలహీనపడటం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌ఐబీ బజాజ్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 400.76 పాయింట్లు నష్టపోయి 85,231.92 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 124 పాయింట్లు నష్టంతో 26068.15 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 89.55కు చేరింది.