తెలంగాణ యాసలో పెళ్లి కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు

పూర్తిగా తెలంగాణ యాసతో రూపొందించిన ఓ పెళ్లి కార్డు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తెలంగాణలో కరీనంగర్‌ జిల్లాకు చెందిన పోకల అనే ఇంటి పేరున్న వారు పెళ్లి కార్డును విభిన్నంగా తయారు చేయించారు. 'మా ఒక్కగానొక్క పిల్లగాడు చి. మధు లగ్గం చి.ల.సౌ పల్లవితో చేసేందుకు అటోళ్లు ఇటోళ్లు ఖాయం చేసిర్రు. అందురూ జెర యాది మరిచిపోకుర్రి' అని పెళ్లి ఆహ్వాన పత్రికలో ముద్రించారు. ఈ పెళ్లి కార్డు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్