TG: మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో అదనపు కట్నం కోసం భార్య స్వప్నను(26) భర్త, అత్తామామలు, మరిది కొట్టి చంపిన విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా అత్తామామలు కిషన్, బుజ్జి, భర్త రామన్న, మరిది నవీన్ స్వప్నను చిత్రహింసలుపెట్టి, కిరాతకంగా కొట్టారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భయపడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వప్నను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు.