ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం (ఏప్రిల్ 28) మధ్యాహ్నం పూజ (30) అనే వివాహిత తన భర్త వద్దని, ప్రియుడే కావాలని మొబైల్ టవర్ ఎక్కింది. మూడు గంటల పాటు పోలీసులను, కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసిన ఆమె, ప్రియుడు జైప్రకాష్‌ను సంఘటనా స్థలానికి తీసుకువచ్చిన తర్వాత శాంతించి కిందకు దిగింది. ప్రేమ వ్యవహారంలో విభేదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆమెను సురక్షితంగా రక్షించి, కుటుంబ సభ్యులతో పాటు ప్రియుడిని కూడా విచారిస్తున్నారు.